Posts

Showing posts from December, 2017

సాగరి

ఓ అరూపరూప సఖీ బండరాళ్లను సైతం కదిలించి కరిగించే నీ సొగసుతో, సౌరసౌవర్ణ  కాంతి తో తళ్ళున మెరుస్తూ, నన్ను అలరిస్తూ, కదిలిస్తూ, పట్టు చిక్కని బెట్టువై, చల్లటి నీ వొడిలో నన్ను సేద తీరుస్తూ, క్షణకాలం లో నిద్రబుచ్చుతూ, నీ నయనానంద ధార నా నొసటన చేరి నా పెదాలపైకి జారి నీ హృదయానుభూతిని నాకు తెలుపగా మరో క్షణం లో మేలుకొల్పుతూ, నీ శ్వాసను నాలో ఐక్యం చేస్తూ, నాలోన ఓ చిరుపదఝరిని కదిలించిన నీకే  ఇది అంకితం.