Posts

Showing posts from June, 2017

Raindrops bring life

విరిసిన మల్లెల్లో పరిమళమై కురిసిన జల్లుల్లో ప్రతిబింబమై చిగురించిన ప్రతి మ్రొక్కలో ప్రాణమై ఆమని కోకిల వాణివై నా ఉశ్వాసవై, నిశ్శ్వాసవై, ఆశవై, కాంక్షవై, హృదయమై, హృదయభావనవై, వేదనవై, నివేదనవై, శోధనవై, మనోకీర్తనవై, నిద్రవై , మెలుకువవై, గతివై, జతివై, క్రియావై , ప్రతిక్రియవై, నా చలనమై, రుధిరమై, శోధనవై, మనోమథనమై , గానమై , ధ్యానమై, ప్రాణమై, నాలోన ఈ భావాలని పులకించి పలికించిన ఓ తన్వీ నా ఈ రచన నీకే అంకితం

O Tanvee

వర్షాకాలపు తొలి జల్లుల్లొ తడుస్తూ, నీ వెంటే నడుస్తూ, నీ ఒక్క చూపు కై ప్రతీక్షిస్తూ,  నా హ్రుదయ వేదనను మౌనంగా భరిస్తున్న నా వైపు ఒక్కమారి ఓరగా చూసి, పక్కున నవ్వి, నీ కంటి సైగతో నా మదివీన పై ప్రేమ తోడి రాగాలని పలికించి నన్ను పులకింపచేసి,  ఒక ఉరుములా ఉరిమి నన్ను కదిలించిన నిన్ను నాలో పదిలంగా నిలుపుకోనా? నీ కాళ్ళ అందెల సవ్వడికి మేల్కొని, నువ్వు చల్లే నీటి జల్లుల్లో ప్రతి ఉదయం తడిసి, నీ ముగ్గుని మస్తకంపై ధరించే నీ ఇంటి ముంగిలిని కానా? పాలల్లో తడిసిన నీ పెదవి రుచికై పరితపించే తుమ్మెదను కానా? నీ దర్పనమై నాలోని నిన్ను చూపించుకోనా? నీ చే స్పర్శకై వేచిచుసే నీ పెరటి మల్లెతీగను కానా? తలగడనై నలిగి నే నీ వెచ్చటి కౌగిలిలో ఒదిగిపోనా? నా మనోభావాలహరి నీ నయనానంద తీరలకై పయనించదా, నీ పాదాలను తడుతూ, నెడుతూ, తడుపుతూ నా ఆశలను నీకు వల్లించి నీటి బుడగై కనుమరుగవదా?

ज़ुबानी दिल की दास्ताँ

उन यादों का सहारा लेकर हम चल रहे हर दम, वो वक़्त जो गुज़रा है कैसे भूल पायेंगे हम? कभी तुम्हारे हाथों में हाथ लेकर चले, कभी तुम्हारे नरम केशों में अपना मुख छुपाते चले, कभी तुम्हारे कोमल गुलाबी होंठो को चूमते चले, कभी तुम्हारी साँसों को अपने में समाते चले, कभी अपने प्यार की दास्ताँ को आखों से सुनाते चले, कभी तुम्हारे पैरों तले पिघलती बरफ बन चले,  कभी पेड़ों की परछाईयों में चले, कभी नदी की लहरों में तैरते चले, कभी लहराती गुनगुनाती हवाओं में चले,  कभी चांदनी रात में अपना परिचय ढूँढते चले, कभी फूलों पे चले, कभी काँटो में चले,  कभी धूप में चले, कभी छाँव में चले,  कभी दर्द के ज़हर का घूँट-घूँट पीते चले  कभी बेवफाई की आग में अंग अंग जलाते चले  कभी तुम्हारे प्यार की प्यास में दम दम घुटते चले, कभी तुम्हारी याद में हर दम मरते चले, मगर सदा अपने दिल की बातों की वरमाला तुम्हें पहनाते चले, तुम्हें पहनाते चले|