O Tanvee
వర్షాకాలపు తొలి జల్లుల్లొ తడుస్తూ,
నీ వెంటే నడుస్తూ,
నీ ఒక్క చూపు కై ప్రతీక్షిస్తూ,
నా హ్రుదయ వేదనను మౌనంగా భరిస్తున్న నా వైపు ఒక్కమారి ఓరగా చూసి, పక్కున నవ్వి, నీ కంటి సైగతో నా మదివీన పై ప్రేమ తోడి రాగాలని పలికించి నన్ను పులకింపచేసి,
ఒక ఉరుములా ఉరిమి నన్ను కదిలించిన నిన్ను నాలో పదిలంగా నిలుపుకోనా? నీ కాళ్ళ అందెల సవ్వడికి మేల్కొని, నువ్వు చల్లే నీటి జల్లుల్లో ప్రతి ఉదయం తడిసి, నీ ముగ్గుని మస్తకంపై ధరించే నీ ఇంటి ముంగిలిని కానా?
పాలల్లో తడిసిన నీ పెదవి రుచికై పరితపించే తుమ్మెదను కానా?
నీ దర్పనమై నాలోని నిన్ను చూపించుకోనా?
నీ చే స్పర్శకై వేచిచుసే నీ పెరటి మల్లెతీగను కానా?
తలగడనై నలిగి నే నీ వెచ్చటి కౌగిలిలో ఒదిగిపోనా?
నా మనోభావాలహరి నీ నయనానంద తీరలకై పయనించదా, నీ పాదాలను తడుతూ, నెడుతూ, తడుపుతూ నా ఆశలను నీకు వల్లించి నీటి బుడగై కనుమరుగవదా?
Comments
Post a Comment